శుక్రవారం 05 జూన్ 2020
Nizamabad - Mar 05, 2020 , 01:01:51

జిల్లాకు కరోనా లేదు

జిల్లాకు కరోనా లేదు

ఖలీల్‌వాడి: జిల్లాలో ఇంత వరకు కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా ప్రభుత్వ దవాఖానలో దీని గురించి ఐసోలేషన్‌ వార్డు పని చేస్తున్నదని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో బుధవారం కరోనా వైరస్‌, పల్లెప్రగతి, పట్టణ ప్రగతిపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇందల్వాయి మం డలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో బాలరాజు అలియాస్‌ రాజయ్య అనే వ్యక్తికి వైరస్‌ సోకినట్లు వార్త లు రావడంతో వెంటనే అతనిని హైదరాబాద్‌లో ని గాంధీ దవాఖానకు పంపించి పరీక్షలు చేయించామన్నారు. ఆయనకు ఈ వైరస్‌ లేనట్ల్లు నిర్ధారణ అయిందని తెలిపారు. అతన్ని బుధవారం సాయంత్రం డిశ్చార్జ్‌ చేశారని తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ఇది రావడానికి అవకాశాలు కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్నాయన్నారు. అందుకు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇది మన దరిచేరదని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావద్దని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఒక ఐసోలేషన్‌ వార్డు వేరు గా ఏర్పాటు చేశామని, అందులో సిబ్బందితో పాటు అన్ని ఇతర సదుపాయాలు సిద్ధం చేశామన్నారు. ఇంకా ఏ అవసరం వచ్చినా ఏర్పాట్లు చేస్తామన్నారు. 


ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఈ వైరస్‌పై సరైన అవగాహన ఉంటే నివారణ అ వకాశాలు కూడా ఉంటాయని తెలిపారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కా ర్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో సర్క్యూలర్‌ కూడా జారీ చేయనున్నామన్నారు. జలుబుతో కూడిన జ్వరం వచ్చి నా దీని గురించి పరీక్షలు చేయించుకోవాలని, వీరి ని ఒక గదిలో వేరుగా ఉంచడం, విద్యార్థులైతే పా ఠశాలకు పంపించకపోవడం మంచిదన్నారు. ఇది ఇంకొకరికి రాకుండా ఉంటుందని తెలిపారు. తు మ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాధిగ్రస్తుల నుంచి ఇంకొకరికి వచ్చే అవకాశం ఉందన్నారు. పలుమార్లు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వేడి నీళ్లు తాగడం, నాలుక ఎండిపోకుండా తరచుగా నీళ్లు తాగడం చేస్తూ ఉండాలని, మరీ చల్లని ప్రదేశాల్లో ఉండకూడదని తెలిపారు. జనసందోహం ఉన్న చోటికి వెళ్లకుంటే మంచిదన్నారు. ఉతికిన బట్టలను కనీసం రెండు గంటలు ఎండలో ఆర వేసుకోవాలన్నారు. ఇది గాలి ద్వారా వ్యాపించదని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయాల్లో పరీక్షలు చేయడంతో పాటు వారు వెళ్లే జిల్లాలకు సమాచారం అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ ఆధ్వర్యంలో ముద్రించిన కరోనా వైరస్‌ అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. 


పట్టణ ప్రగతి కొనసాగింపు..

పది రోజులుగా నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఈ రోజుతో పూర్తయినప్పటికీ ఇంకా కొనసాగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, హరితహారం తదితర కార్యక్రమాలను అనుకున్న మేర పూర్తి చేస్తామన్నారు. వీటితో పాటు రోడ్లు, డ్రెయిన్స్‌, ఓపెన్‌ ప్లాట్లు శుభ్రం చేయడం, ప్రతి వార్డులో 200 మొక్కలు నాటడం, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, పార్కుల ఏర్పాటు, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే వేరే శాఖల స్థలాలను తీసుకొని వీటిని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన పెరుగుతున్నదని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ దిశగా ఉత్సాహంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 


చివరిదశకు పల్లెప్రగతి పనులు..

పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి దశకు చేరుకున్నాయని కలెక్టర్‌ వివరించారు. 530 గ్రామ పంచాయతీలకు గాను ప్రతి జీపీ కలుపుకొని 530 ట్రాక్ట ర్లు కొనుగోలు చేశామన్నారు. కొన్నింటికి ట్యాంక ర్లు, ట్రాలీలు కూడా తీసుకున్నామన్నారు. 527 గ్రామ పంచాయతీలకు డంపింగ్‌ యార్డులు, 526 జీపీలకు కంపోస్టు షెడ్లు మంజూరు చేశామ ని తెలిపారు. 520లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. 528 శ్మశాన వాటికలకు మంజూ రు ఇచ్చామని, 522 పనులు ప్రారంభమయ్యాయన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులను అవసరం మేరకు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగానికి అవకాశం ఇచ్చారని ఈ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్‌ నిషేధించడానికి ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్లనున్నామన్నారు. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. 


సామాజిక బాధ్యతలో భాగంగా మున్సిపాలిటీల్లోని వ్యాపారులు, ఫ్యాక్టరీల యజమాను లు వారి దుకాణాల ముందు కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని, స్థలం అందుబాటులో ఉంటే మ రిన్ని మొక్కలు నాటి వారి సామాజిక బాధ్యతను పూర్తి చేయాలన్నారు. ఈ నెల 23 నుంచి ఆరు రో జుల పాటు మొక్కలపై ఆడిట్‌ నిర్వహిస్తున్నారని, 85శాతం కంటే తక్కువ మొక్కలు బతికితే సం బంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ లత, డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారాం రా థోడ్‌, సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు, డీఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌, డీపీవో జయసుధ పాల్గొన్నారు. logo