సోమవారం 25 జనవరి 2021
Nirmal - Jan 01, 2021 , 03:58:24

నిర్మల్‌ జిల్లాలో తగ్గిన నేరాలు

నిర్మల్‌ జిల్లాలో తగ్గిన నేరాలు

  •  వార్షిక నివేదిక విడుదల చేసినఇన్‌చార్జి ఎస్పీ

నిర్మల్‌ అర్బన్‌, డిసెంబర్‌ 31:  జిల్లాలో 2020 సంవత్సరంలో నేరాల శాతం తగ్గినట్లు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ తెలిపారు. జిల్లాలో ఈ ఏడాదిలో జరిగిన నేరాల వివరాలను గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో 2266 కేసులు నమోదైనట్లు తెలిపారు. 2019లో 2639 ఎఫ్‌ఐఆర్‌ నమోదు, కాగా గతేడాదితో పోల్చితే 20202లొ 14.13 శాతం కేసులు తగ్గినట్లు తెలిపారు. కేసుల తగ్గింపులో పోలీసుల కృషి ఎంతో ఉందని వివరించారు. జిల్లాలో హత్యలు,లోక్‌ అదాలత్‌, ఎన్‌డీపీసీ, ఈ-చలాన్‌, లేజర్‌ గన్‌, పేకాట కేసులు 2019 కంటే ఎక్కువగా నమోదైనట్లు వెల్లడించారు. పోక్సో యాక్టు కేసులు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, మట్కా, ఎక్సైజ్‌, గుట్కా, నాన్‌ బెయిలెబుల్‌, కలప అక్రమ రవాణ, మిస్సింగ్‌ కేసుల సంఖ్య తగ్గిందని వివరించారు. 


logo