యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డు 2026 గెలుచుకున్న డాక్యుమెంటరీ ఏది?
యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డు 2026’ గెలుచుకున్న డాక్యుమెంటరీ.. ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన అత్యంత ధనికుడు వంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు, సమాధానాలు ఈ వారం కరెంట్ మీటర్లో తెలుసుకుందాం.
1) నిరసనల పేరుతో విధ్వంసాలకు, దోపిడీలకు దారితీసే విద్యార్థుల ఆందోళనలను కట్టడి చేసే బిల్లును సెనెట్‌లో ప్రవేశపెట్టిన దేశమేది?
2) ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ వైమానిక దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన స్థానంలో తదుపరి వాయుసేన వైస్ చీఫ్‌గా రక్షణశాఖ ఎవరిని నియమించింది?
3) తొలిసారిగా నిర్వహించిన ‘కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్ 2026’లో పాల్గొన్న పురుషుల, మహిళల జట్లు గెలుచుకున్న పతకాలెన్ని?
4) 9వ ఐఎస్ఏ అసెంబ్లీ సమావేశాల్లో ‘అంతర్జాతీయ సౌర కూటమి’ అధ్యక్ష దేశంగా వరుసగా మూడోసారి ఎన్నికైన దేశమేది?
5) తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంచుతూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఈ సవరణ ద్వారా న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎన్నేండ్లకు చేరింది?
6) క్యూబాపై దశాబ్దాలుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక, వాణిజ్యపరమైన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. దీనికి ఎన్ని దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి?
7) హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు దీటుగా మన దేశపు నౌకాదళాన్ని బలోపేతం చేయడం కోసం ఎనిమిది యుద్ధ నౌకలను రక్షణశాఖ సిద్ధం చేయనున్నది. ఈ నౌకల నిర్మాణం కోసం ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది?
8) నవంబర్ నెల ప్రారంభంలో విడుదలైన ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలోనే ఒక్కరోజులో అత్యధిక సంపద జమ చేసుకున్న కుబేరుడెవరు?
9) ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్-అక్టోబర్ 2026’ నివేదిక ప్రకారం భారత్‌లో ఎంతమంది తీవ్ర పేదరికం అంచుల్లోంచి బయటపడ్డారు?
10) బీహార్‌లో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ, బాల్య వివాహాలను అరికట్టేందుకు మహిళలు సాగించిన ఉద్యమాన్ని చిత్రీకరించిన డాక్యుమెంటరీని ప్రతిష్ఠాత్మక ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డు 2026’ వరించింది. ఆ డాక్యుమెంటరీ పేరేమిటి?
జవాబులు
1. ఫ్రాన్స్
2. ఇందర్‌పాల్ సింగ్ వాలియా
3. 2 (స్వర్ణాలు)
4. భారత్
5. 62
6. 130
7. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ (జీఆర్ఎస్ఈ), గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్)
8. ముకేశ్ అంబానీ
9. 49.6కోట్లు
10. మదర్స్ ఆఫ్ కరేజ్

Inderpal Award Documentary

Isa

Protest Bill Senate
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

