UGC NET December 2024 | దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూజీసీ నెట్ (డిసెంబర్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. 2025 జనవరి 3 నుంచి 27 వరకు మొత్తం 83 సబ్జెక్టులకు ఆన్లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఆదివారం ప్రకటించింది. యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షకు మొత్తం 8,49,166 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 6,49,490 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో జునియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌కి (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం 5158 మంది అర్హత పొందగా.. అసిస్టెంట్ ప్రొఫెసర్, PhD అడ్మిషన్ కు 48,161 మంది, కేవలం పీహెచ్ డీ కోసం 1,14,445 మంది అర్హత సాధించారు. ఇక యూజీసీ నెట్ ఫలితాల కోసం ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.