న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్‌డీడీఐ) 2021-22 విద్యాసంవత్సరానికిగాను బీడిజైన్, బీబీఏ, ఎండిజైన్, ఎంబీఏ వంటి పలు యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కల్పిస్తున్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కోర్సులు-వివరాలు
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీ డిజైన్)
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ (బీబీఏ)
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్ (10+2)లో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తాము ఉత్తీర్ణులైనట్లు సెప్టెంబర్ 30 నాటికి సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. 2021, జూలై 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు.
మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఎండిజైన్/ఎంబీఏ)
మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఫుట్‌వేర్ డిజైన్, ప్రొడక్షన్)
అర్హత: ఫుట్‌వేర్, లెదర్ గూడ్స్, డిజైన్, ఫ్యాషన్, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్లో బ్యాచిలర్ డిగ్రీ ఏదో ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి.
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ-రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్కండైజ్)
అర్హత: డిగ్రీలో ఉత్తీర్ణులై, ఇంగ్లిష్ భాషపై పట్టు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా
పరీక్ష విధానం: బ్యాచిలర్ ప్రోగ్రామ్‌కి సంబంధించి పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు (25 మార్కులు), వెర్బల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు (40), జనరల్ అవేర్నెస్ 35 ప్రశ్నలు (35), బిజినెస్ అడ్ డిజైన్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు (100 మార్కులు) వస్తాయి.
మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించి 175 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు (50 మార్కులు), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50ప్రశ్నలు (50), జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 50 ప్రశ్నలు (50), మేనేజ్ మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అనలిటిక్ ఎబిలిటీ 50 ప్రశ్నల (50) చొప్పున అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేది: జూన్ 15
ప్రవేశ పరీక్ష: జూలై 4
వెబ్సైట్: www.fddiindia.com