మంగళవారం 26 మే 2020
Nipuna-education - May 23, 2020 , 19:02:42

‘ప్రిన్సిపల్‌' దరఖాస్తుల సమర్పణకు గడువు జూన్‌ 5

‘ప్రిన్సిపల్‌' దరఖాస్తుల సమర్పణకు గడువు జూన్‌ 5

హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినవారు హార్డ్‌కాపీలు, టెస్టిమోనియల్స్‌ను జూన్‌ 5లోపు పంపించాలని నియామక బోర్డు ప్రకటించింది. హార్డ్‌కాపీలు, టెస్టిమోనియళ్లను రిజిస్టర్‌ పోస్టు ద్వారానైనా, వ్యక్తిగతంగానైనా సమర్పించవచ్చని తెలంగాణ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్య్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) వెల్లడించింది. రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపాలనుకునేవారు చైర్మన్‌, టీఆర్‌ఈఐ-ఆర్‌బీ, డీఎస్‌ఎస్‌ భవన్‌, 4వ అంతస్థు, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌-500028 అడ్రస్‌కు పంపించాలని తెలిపింది.


logo