SSC Results | పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. రేపే పరీక్షా ఫలితాలు విడుదల.. ఈసారి వాట్సాప్‌లోనూ!
SSC Results | పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్ వెల్లడించున్నారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు.
SSC Results | పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్ వెల్లడించున్నారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14వ తేదీన పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీన పరీక్షలు పూర్తయ్యాయి. సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ నెల 23వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయ్యింది. మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడించాలని ముందుగా భావించినప్పటికీ.. దానికంటే ముందు ఫలితాల వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
వాట్సాప్‌లోనూ పదో తరగతి పరీక్షలు
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది వాట్సాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఎస్సెస్సీ బోర్డు ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది. వాట్సాప్ ద్వారా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకొన్న వారి మొబైల్ నంబర్‌కు ఆటోమెటిక్‌గా మెమో వెళుతుంది.
డౌన్లోడ్ చేసుకోని వారు మాత్రం.. 80969 58096 నంబర్‌కు ‘హాయ్’ అని సందేశం పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్ అని టైప్‌చేసి హాల్‌టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదుచేయాలి. ఆ తర్వాత ఫలితం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

