గుడ్న్యూస్.. ఎస్బీఐ క్లర్క్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు
ఎస్బీఐ క్లర్క్| దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లర్క్ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. క్లరికల్ క్యాడర్లో 5121 కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నది.

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లర్క్ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. క్లరికల్ క్యాడర్లో 5121 కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నది. దీనికి సంబంధించిన దరఖాస్తు గడువును పొండిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న దరఖాస్తు ముగుస్తుండగా, దానిని మరో మూడు రోజులపాటు ఎక్స్టెండ్ చేసింది. దీంతో ఈనెల 20 వరకు అధికారిక వెబ్సైట్లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో హైదరాబాద్ రీజియన్లో 275 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులకు 2021, ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మార్కులను ప్రశ్నలు ఇస్తారు. అన్ని ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షను గంట వ్యవధిలో రాయాల్సి ఉంటుంది.
రెండో దశ.. మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఆజ్జెక్టివి విధానంలో ఉంటాయి. పరీక్షను 2.40 గంటల్లో పూర్తిచేయాలి.
వీటిలో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 20
ప్రిలిమినరీ రాతపరీక్ష: జూన్ నెలలో
మెయిన్ పరీక్ష: జూలై 31
వెబ్సైట్: https://www.sbi.co.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

