ఎస్‌ఎస్‌సీటీయూలో ప్రవేశాలకు నోటిఫికేషన్
ములుగులోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వైస్ చాన్స్‌లర్ వైఎల్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. జాతీయ విద్యావిధానంలో భాగమైన సీయూఈటీ, జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్టు చెప్పారు.
ములుగు, జూలై 22(నమస్తేతెలంగాణ) : ములుగులోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వైస్ చాన్స్‌లర్ వైఎల్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. జాతీయ విద్యావిధానంలో భాగమైన సీయూఈటీ, జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్టు చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ సహకారంతో బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నాలుగేండ్ల కోర్సులో 30 సీట్లు, బీఎస్సీ హానర్స్, కంప్యూటర్ సైన్స్, డాటా అనాలిటిక్స్ నాలుగు సంవత్సరాల కోర్సులో 25 సీట్లు, బీఎస్సీ హానర్స్ గణితం, కంప్యూటర్ నాలుగేళ్ల కోర్సులో 25 సీట్లు, బీఏ హానర్స్ ఇంగ్లిష్ నాలుగేండ్ల కోర్సులో 25 సీట్లు, బీఏ హానర్స్ ఎకనామిక్స్ నాలుగు సంవత్సరాల కోర్సులో 25 సీట్లు ఉన్నాయని తెలిపారు.
నేటి నుంచి ఆన్లైన్లో ఆగస్టు 3 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని, 5వ తేదీన మెరిట్‌లిస్ట్ ప్రకటించి, 11వ తేదీన కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. మొత్తం 130 సీట్లలో జనరల్ కోటాలో 48, ఈడబ్ల్యూఎస్‌లో 15, ఓబీసీ కోటాలో 36, ఎస్సీ కోటాలో 21, ఎస్టీ కోటాలో 12 సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

