కరెంట్ అఫైర్స్
1. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి.
ఎ. 2023లో 34 దేశాల్లో 1000 కంటే తక్కువ మలేరియా కేసులు నమోదయ్యాయి
బి. 2023లో అజర్బైజాన్, బెలిజ్, తజకిస్థాన్ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా నిర్మూలనా దేశాలుగా గుర్తింపునిచ్చింది
సి. ఆసియా ఖండంలో శ్రీలంక, చైనా మలేరియా నిర్మూలనా దేశాలు
డి. 2022లో భారతదేశంలో 2021తో పోలిస్తే మలేరియా కేసుల మరణాలు పెరిగాయి
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
2. 2023 ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా’లో భారతదేశం నుంచి నలుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు, వారి ర్యాంకులను జతపరచండి.
1. నిర్మలా సీతారామన్ ఎ. 70వ
2. సోమా మండల్ బి. 36వ
3. కిరణ్ మజుందార్ షా సి. 76వ
4. రోష్ని నాడార్ మల్హోత్రా డి. 60వ
ఇ. 32వ
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-ఇ, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఇ, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3. 2021-22 సంవత్సరంలో కజిరంగా జాతీయ పార్కు, పులుల సంరక్షణ కేంద్రం నిర్వహించిన 4వ నీటి పక్షుల సర్వే ప్రకారం గుర్తించిన పక్షుల సంఖ్య?
1) 94,931 2) 91,943
3) 93,949 4) 93,941
4. 2023 డిసెంబర్లో ‘గుజరాత్ గార్భా నృత్యం’ యునెస్కో ‘అసంగత సాంస్కృతిక వారసత్వ జాబితా’లో చేర్చింది, దీని గురించి సరైన వాక్యం?
ఎ. భారతదేశం నుంచి ఇది 15వది
బి. దీన్ని 2023, డిసెంబర్ 5 నుంచి 9 తేదీల మధ్య బోట్స్వానాలోని కసానేలో జరిగిన 18వ సమావేశంలో ప్రకటించింది
సి. బంగ్లాదేశ్ రిక్షాలు, రిక్షా పెయింటింగ్‌లను కూడా చేర్చింది
డి. భారత్ నుంచి 2021లో కుంభమేళా కూడా చేరింది
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, డి 4) ఎ, బి, డి
5. 2023 భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి ఎవరు?
1) ఇమ్మాన్యుయేల్ మేక్రాన్
2) సిరిల్ రామఫోసా
3) జైర్ బోల్స్‌నారో
4) అబ్దుల్ ఫతా ఎల్-సీసీ
6. కింది వాక్యాలను గమనించి సరికాని వాక్యాన్ని ఎంచుకోండి.
1) 2023 సంవత్సరానికి టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ‘టైలర్ స్విఫ్ట్’
2) 2023 సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ‘రిజ్’
3) 2023 సంవత్సరానికి డిక్షనరీ డాట్‌కామ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ‘సర్వైవల్ మోడ్’
4) 2022 సంవత్సరానికి ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ ‘గాబ్లిన్ మోడ్’
7. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో భారతదేశం నుంచి చోటు దక్కించుకున్నవారు?
1) నిర్మలా సీతారామన్, రోష్నీ నాడార్ మల్హోత్రా, సోమా మండల్, కిరణ్ మజుందార్‌షా
2) నిర్మలా సీతారామన్, రోష్నీ నాడార్ మల్హోత్రా, ఇంద్రానూయి, సోమామండల్
3) నిర్మలా సీతారామన్, ఇంద్రానూయి, సోమా మండల్, కిరణ్ మజుందార్ షా
4) నిర్మలా సీతారామన్, రోష్నీ నాడార్, ఇంద్రానూయి, కిరణ్ మజుందార్‌షా
8. నీటిలో ఆర్సెనిక్ ఇతర మెటల్ అయాన్లు తొలగించడానికి అమృత్ పేరుతో భారతీయ సాంకేతికతను అభివృద్ధి చేసినది?
1) ఐఐటీ ఖరగ్‌పూర్ 2) ఐఐటీ రూర్కీ
3) ఐఐటీ మద్రాసు 4) ఐఐటీ ఢిల్లీ