హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ), బీఈ (సీబీసీఎస్), బీఈ (నాన్ సీబీసీఎస్) అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షా ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. రూ.200 అపరాధ రుసుముతో 30వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.