JEE Main | నేడు జేఈఈ మెయిన్ ర్యాంకులు.. విడుదల చేయనున్న ఎన్టీఏ
జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్ 2 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) గురువారం విడుదల చేయనుంది. బీటెక్, బీఈ ప్రవేశాలకు పరీక్ష ఫైనల్ కీని కూడా అందుబాటులో ఉంచనుంది. అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్‌చేసుకోవచ్చు.
హైదరాబాద్: జేఈఈ మెయిన్ (JEE Main) సెషన్ 2 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) గురువారం విడుదల చేయనుంది. బీటెక్, బీఈ ప్రవేశాలకు పరీక్ష ఫైనల్ కీని కూడా అందుబాటులో ఉంచనుంది. అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్‌చేసుకోవచ్చు. దీనికోసం విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బీటెక్ ప్రవేశాల కోసం ఈ నెల 2, 3, 4, 7, 8 తేదీల్లో, బీఆర్క్, బీప్లాన్ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఏప్రిల్ 9న పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
కాగా, మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా.. రెండో సెషన్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. వీటి ఆధారంగా పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించనుంది. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్‌ను నిర్ణయించి సెషన్ 1, 2లో అర్హత సాధించిన మొత్తం 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ప్రకటించనుంది. వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 18న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహిస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు
ఫీజు చెల్లింపు చివరి తేదీ: మే 5
హాల్‌టికెట్లు: మే 11
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష: మే 18
రెస్పాన్స్ షీట్లు విడుదల: మే 22
ప్రాథమిక కీ విడుదల: మే 26 .
ఫైనల్ కీ, ఫలితాలు విడుదల: జూన్ 2న ఉదయం 10 గంటలకు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

