NEET UG Syllabus | నీట్-యూజీ సిలబస్ కుదింపు.. నూతన సిలబస్‌ను విడుదల చేసిన ఎన్ఎంసీ
NEET UG Syllabus | ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్‌లో కోతపెట్టారు. విద్యార్థులపై భారం తగ్గించడంలో భాగంగా నీట్-2024 నూతన సిలబస్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సిలబస్‌లో స్పల్ప మార్పులు చేసింది.
NEET UG Syllabus | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) అండర్ గ్రాడ్యుయేట్ సిలబస్‌లో కోతపెట్టారు. విద్యార్థులపై భారం తగ్గించడంలో భాగంగా నీట్-2024 నూతన సిలబస్‌ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సిలబస్‌లో స్పల్ప మార్పులు చేసింది. ఈ ఏడాది నీట్‌ను 2024 మే 5న నిర్వహిస్తారు. నీట్ రిజిస్ట్రేషన్లు ఇంకా ప్రారంభం కాలేదు.
ఎన్ఎంసీ విడుదల చేసిన సిలబస్ ప్రకారం.. భౌతికశాస్త్రంలో అధికంగా సిలబస్ కోతకు గురైంది. కెమిస్ట్రీలోనూ కొన్ని పాఠ్యాంశాలను తగ్గించారు. బాటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్ తగ్గించడం విద్యార్థుల ప్రిపరేషన్‌పై పెద్ద ప్రభావమేమీ చూపదని నీట్ శిక్షకుడు శంకర్రావు పేర్కొన్నారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లలో భారీగా సిలబస్‌ను తగ్గించారని తెలిపారు. ఇది విద్యార్థులకు అనుకూలించే అంశమని వెల్లడించారు. సిలబస్‌ను ఆలస్యంగా విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. సిలబస్ తగ్గింపుతో ప్రస్తుత సెకండియర్ విద్యార్థుల కన్నా, ఫస్టియర్ విద్యార్థులకే అధిక లాభమని ఆయన విశ్లేషించారు.
తొలగించిన పాఠ్యాంశాలు
రసాయనశాస్త్రం ఫస్టియర్: పదార్థం స్థితి, హైడ్రోజన్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ.
రసాయనశాస్త్రం సెకండియర్: ఘనస్థితి, ఉపరితల రసాయశాస్త్రం, మెటలర్జీ, రోజువారీ జీవితంలో పాలిమర్లు, కెమిస్ట్రీ.
భౌతికశాస్త్రం ఫస్టియర్: ప్యూర్ రోలింగ్, కనెక్టింగ్ బాడీలు, పాలిట్రోపిక్ ప్రక్రియ, బలవంతమైన, దెబ్బతిన్న డోలనాలు.
భౌతికశాస్త్రం సెకండియర్: పొటెన్షియల్, నాన్ పొటెన్షియల్ సంభావ్యత, ప్రొటెన్షియో మీటర్, ఎర్త్ మ్యాగ్నటిజం, రేడియో యాక్టివిటీ, ట్రాన్సిస్టర్లు, ఆంప్లిప్లయర్లు.
జువాలజీలో యూనిట్ -2: వానపాములు, యూనిట్-5లో శరీర నిర్మాణశాస్త్రం, జీర్ణక్రియ శోషణం, జ్ఞానేంద్రియాలు (చెవులు, కండ్లు), యూనిట్ -10లో జీవావరణం, పర్యావరణం, పర్యావరణ సమస్యలు, పశుసంవర్ధకం.
బోటనీ ఫస్టియర్: ప్లాంట్ ఫిజియోలజీలో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్, మార్పొలజీ.
బోటనీ సెకండియర్: స్ట్రాటజీస్ ఫర్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్.
బోటనీలో కొత్తగా చేర్చినవి: బయో మాలిక్యూల్స్, ఎంజైములు, ప్రాపర్టీలు, మాల్వేస్, లెగుమనీస్ సహా మరికొన్ని అంశాలను చేర్చారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

