ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 11: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (పీఈ) నాలుగు, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, మొదటి, రెండు, మూడు, అయిదో సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడుచ్చన్నారు.