30 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు.. మార్చిలో ఎగ్జామ్స్
Inter Exams | రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 2023 మార్చిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను 2023 మార్చిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు, రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు, 1000 రుసుముతో 14 నుంచి 17 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఫస్టియర్, సెకండియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.500, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని అధికారులు సూచించారు. ఈ సంవత్సరం 100 శాతం సిలబస్ అమలవుతుందని, పాతపద్ధతిలోనే పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు. కాలేజీల్లో అడ్మిషన్ పొందకుండా, హాజరుశాతం లేకుండా హాజరు మినహాయింపు పథకం కింద విద్యార్థులు రూ.500 ఫీజు కట్టి పరీక్షలు రాయెచ్చని తెలిపారు. అలాంటి విద్యార్థులు ఈ నెల 14 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

