ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ముంబై జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ 2022 రెస్పాన్స్ షీట్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు http://jeeadv.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి, రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.జేఈఈ అడ్వాన్స్డ్ 2022 షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ ఆన్సర్ కీ సెప్టెంబర్ 3న విడుదల చేయనుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 4 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్టు ఐఐటీ ముంబై తెలిపింది.