ఇంటర్ పూర్తయిందా..? సాఫ్ట్వేర్ కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారా? చదువుకునే స్తోమత లేదా? అయితే ఈ వివరాలు చూడండి.. ఉద్యోగానికి కావల్సిన శిక్షణతోపాటు స్టయిఫండ్ ఇస్తారు. ఉన్నత చదువులను చదువుకునే అవకాశం కల్పిస్తారు. అనంతరం ప్రముఖ ఐటీ కంపెనీ
హెచ్‌సీఎల్‌లో ఉద్యోగాన్ని ఇస్తారు. వీటన్నింటి సమాహారమే హెచ్ఎస్ఎల్ టెక్ బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్. ఇంటర్ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులైనవారు అర్హులు. హెచ్‌సీఎల్
నిర్వహించే రాతపరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిస్తే చాలు ఈ ప్రోగ్రామ్ విశేషాలు మీ కోసం..
ఉద్యోగం చేస్తూనే ప్రసిద్ధ సంస్థల నుంచి డిగ్రీ కోర్సులనూ చదువుకునే అవకాశం కల్పిస్తారు.
శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని అదే కంపెనీలో ఫుల్‌టైమ్ ఐటీ ఇంజినీర్‌గా తీసుకుంటారు.
నోట్: శిక్షణకు ఎంపికైనవారు ఐటీ సర్వీస్ ప్రోగ్రామ్, అసోసియేట్ ప్రోగ్రామ్‌లకు రూ.లక్ష + పన్నులు చెల్లించాలి. ఈ ఫీజులను కట్టలేని వారికి ఈ మొత్తానికి బ్యాంకు ద్వారా రుణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. శిక్షణలో ప్రతిభ చూపినవారు చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధిస్తే వందశాతం ఫీజు, 85 నుంచి 90 శాతం స్కోర్ వచ్చినవారికి 50 శాతం ఫీజు వెనక్కి ఇస్తారు.
–గగన కుమారి, టెక్ బీ స్కాలర్
మనోజ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, నాగ్‌పూర్ బ్రాంచ్
–బాలాజీ, టెక్ బీ స్కాలర్
–సాయి ప్రశాంత్, టెక్ బీ స్కాలర్
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: దేశంలోని ఆయా ఇంటర్/తత్సమాన కోర్సులు నిర్వహించే బోర్డుల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనసాగుతూనే ఉంటుంది.వెబ్సైట్: https://www.hcltechbee.com/job-programes
పూర్తి వివరాల కోసం
8448386391 ను
సంప్రదించండి