వరంగల్ : ఆల్ ఇండియా కోటా బీహెచ్ఎంఎస్ సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్ హోమియోపతి కళాశాలలోని ఆల్ ఇండియా కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఈ నెల 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు కళాశాల వారీగా వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. నీట్ -2021 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను చూడాల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.