న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్) ఏటా నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) నోటిఫికేషన్ త్వరలో వెలువడనుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఈ టెస్ట్ ద్వారా ఫ్లయింగ్ డ్యూటీ, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీల్లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో టెక్టికల్, నాన్టెక్నికల్ పోస్టులు ఉంటాయి. AFCATని ఐఏఎఫ్ ఏటా రెండుసార్లు ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో నిర్వహిస్తుంది. ప్రస్తుతం రెండో బ్యాచ్ కోసం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వెలువడనుంది. దీనిద్వారా ఏఎఫ్సీఏటీ ఎంట్రీ, ఎన్సీసీ ఎంట్రీ, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటీరియాలజీ ఎంట్రీ చేపట్టనున్నారు.
మొత్తం పోస్టులు: 334
అర్హతలు: ఫ్లయింగ్ బ్రాంచీకి.. ఇంటర్లో (10+2)లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో కనీ సం 50 శాతం మార్కులు రావాలి. అదేవిధంగా డిగ్రీ 60 మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
గ్రౌంట్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచీకి.. 10+2లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 60 మార్కులు, నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 25 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఆఫీసర్స్ ఇంటెలిజన్స్ రేటింగ్ టెస్ట్ అండ్ పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కసింగ్ టెస్ట్, సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ.
పరీక్ష విధానం..
పరీక్ష మొత్తం 100 ప్రశ్నలకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్లో వర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి మొత్తం 300 మార్కులు. పరీక్షను 2 గంటల్లో రాయాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కులు కేటాయిస్తారు. అయితే ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.250. ఎన్సీసీ స్పెషల్ ఎట్రీకి ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 1
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: www.careerindianairforce.cdac.in OR www.afcat.cdac.in