అంతరించిపోయిన జంతువులను దగ్గరగా చూస్తూ ఆ అనుభూతిని పొందితే ఎలా ఉంటుంది.. మనకు నచ్చిన కృత్రిమవాతావరణాన్ని సృష్టించి అందులో విహరిస్తుంటే ఎలా ఉంటుంది.. అంతరిక్షంలోఅడుగులేస్తుంటే ఎలా ఉంటుంది.. వింటుంటే మనస్సు ఊహాలోకంలోతేలియాడుతుంది కదూ.. అసాధ్యమైన వీటిని సాధ్యం చేయగలిగే టెక్నాలజీలే వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వీటిని కలిపే మిక్స్డ్ రియాలిటీలు. వీటినే ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్) టెక్నాలజీస్ అంటారు. ఈ ఎక్స్ఆర్ గురించి నిపుణ పాఠకుల కోసం..
XR టెక్నాలజీస్ అంటే ఏమిటి?
వాస్తవ ప్రపంచాన్ని, వర్చువల్ ప్రపంచాన్ని కలిపే వర్చువల్ రియాలిటీ (VR), ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), మిక్స్డ్ రియాలిటీ (MR) వంటి ఆధునిక టెక్నాలజీలనే XR టెక్నాలజీస్ అంటారు. IDC 2019 ప్రకారం 2023 నాటికి ఈ XR మారెట్ విలువ సుమారు 16,000 కోట్ల రూపాయలు కానుంది. NASSCOM అంచనా ప్రకారం 2022 నాటికి XR మారెట్ 650 కోట్ల పైనే ఉండబోతుంది.
వర్చువల్ రియాలిటీ అంటే?
సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి కృత్రిమ పర్యావరణాన్ని నిర్మించవచ్చు. నిజ జీవితంలో పర్యావరణాన్ని ఎలా ఆస్వాదిస్తామో అలాగే కృత్రిమ పర్యావరణాన్ని కూడా ఆస్వాదించడమే వర్చువల్ రియాలిటీ. ఈ వర్చువల్ రియాలిటీతో వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా వేరే ప్రపంచానికి వెళ్లిపోతారు.
ఇలా అనుభూతిని పొందడానికి ఒక వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ని ఉపయోగించాలి. వీఆర్ హెడ్సెట్ పెట్టుకుంటే అందులో ఏదైనా ఒక సన్నివేశం చూస్తే అది కళ్లముందు జరుగుతుందా అన్నట్టుగా ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు అంతరించిపోయిన డైనోసార్లను ఇప్పుడు చూడటం కుదరదు. అదే ఈ వర్చువల్ రియాలిటీతో అసలు ఈ డైనోసార్లు ఎలా ఉండేవి, ఎలాంటి పర్యావరణంలో నివసించాయి అనేది వర్చువల్‌గా తయారుచేసి నిజంగా డైనోసార్ పకనే ఉన్న అనుభూతిని పొందవచ్చు. ఇలా కనిపించకుండా సముద్రం మధ్యలో, అంతరిక్షంలో గ్రహాల పై ఉన్నటువంటి వాస్తవ ప్రపంచాన్ని ఇలా ఈ వర్చువల్ రియాలిటీతో సృష్టించవచ్చు.
ఈ వర్చువల్ రియాలిటీ సినిమా, వీడియోలకే పరిమితం కాకుండా ఎన్నో రంగాల్లో విస్తరించింది. ఉదాహరణకు అందరికి ఇష్టమైన క్రికెట్లో కూడా దీనిని ఉపయోగించారు. ఒక అంతర్జాతీయ స్టేడియంలో కేవలం క్రికెట్ చూడగలం. అదే స్వయంగా ఒక అంతర్జాతీయ స్టేడియంలో వేలాది మంది అభిమానుల కేరింతల మధ్యలో ఫోర్లు, సిక్సులు కొడుతుంటే ఆ అనుభూతే వేరు కదా! ఈ అనుభూతిని ఇవ్వడానికి ఐబీ క్రికెట్ అనే వర్చువల్ రియాలిటీ క్రికెట్‌ని పూర్తిగా హైదరాబాద్‌లోనే తయారుచేశారు.
AR అంటే?
వాస్తవ ప్రపంచంలో ఉండే ఏ వస్తువైనా ఉదాహరణకు ఇల్లు, టీవీ, సోఫా ఇలా ఏదైనా సాఫ్ట్వేర్ సాయంతో తయారుచేస్తే వాటిని వర్చువల్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇలాంటి వర్చువల్ ఆబ్జెక్ట్స్‌ని నిజ ప్రపంచంతో కలిసి కనిపించేలా చేయడానికి ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగిస్తాం. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీతో నిజంగా లేని వస్తువులు కూడా వాస్తవ ప్రపంచంలో కనిపించేలా చెయ్యవచ్చు. ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి అప్లికేషన్స్‌లో వివిధ రకాల ఫిల్టర్లు ఉపయోగిస్తుంటాం కదా! అందులో ఒక వర్చువల్ ఆబ్జెక్ట్ వాస్తవ ప్రపంచంలో కనిపిస్తుంది. దాని వెనుక ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీని ఉపయోగిస్తారు.
ఆన్లైన్ షాపింగ్‌లో..
సాధారణంగా ఆన్లైన్ షాపింగ్‌లో కేవలం ఫొటోలు చూసి కొంటుంటారు. అదే కొనడానికి ముందు అది ఎలా ఉంటుందో తెలిస్తే ఉదాహరణకు ఒక టీ షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుందో ముందే తెలిస్తే ఎంత బాగుంటుందో కదా అది కూడా ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీతో సాధ్యం అవుతుంది.
వీఆర్, ఏఆర్‌లకు తేడా?
వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ రెండు వేర్వేరు విషయాలు, విధానాల్లో సాధిస్తాయి. వీఆర్ హెడ్సెట్ సాయంతో ఏదైనా కొత్త వర్చువల్ ప్రపంచానికి వెళ్లి వాస్తవ ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండటాన్ని వర్చువల్ రియాలిటీ అంటారు. అదే ఒక కృత్రిమ ఆబ్జెక్ట్ అంటే ఫోన్, పెన్, టీవీ ఇలా ఏదైనా ఒక లేని ఆబ్జెక్ట్‌ని వాస్తవ ప్రపంచంలో కనిపించేలా చేయడాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటారు.
మిక్స్డ్ రియాలిటీ అంటే?
వాస్తవ ప్రపంచం, వర్చువల్ ప్రపంచాల కలయికనే మిక్స్డ్ రియాలిటీ అంటారు. ఇందులో వాస్తవ ప్రపంచంలో ఉంటారు. కానీ వర్చువల్ ఆబ్జెక్ట్స్‌ని చూడవచ్చు. అలాగే వాటితో ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. వినడానికి కొంచెం ఆగ్మెంటెడ్ రియాలిటీలా అనిపిస్తుంది. దీనిని ఆగ్మెంటెడ్ రియాలిటీకి కొద్దిగా అడ్వాన్స్డ్ వెర్షన్ అంటారు.
అవకాశాలు
వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీలను కలిపి ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR) టెక్నాలజీ అంటారు. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా రాబోయే 5 సంవత్సరాల్లో AR /VR టెక్నాలజీలు పూర్తి ప్రభావాన్ని చూస్తాయని చెబుతున్నారు. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. AR/VR ఉద్యోగ అవకాశాల పెరుగుదల ఇతర ఇంజినీర్ల కంటే 9 నుంచి 10 రెట్లు ఎకువగా ఉంది. అమెరికాలో AR/VR ఇంజినీర్ల సగటు మూల వేతనం కోటి రూపాయలు. 2022 మారెట్ అంచనా ప్రకారం ఈ AR /VR 34 శాతం వీడియో గేమ్స్ రంగంలో, 15 శాతం వైద్య రంగంలో, 14 శాతం ఇంజినీరింగ్ రంగంలో ఉండబోతుంది.
ప్రతి రంగంలో VR/AR
ట్రెయినింగ్ రంగంలో ఈ టెక్నాలజీలు అద్భుతమైన మార్పులు తీసుకురానున్నాయి. ఉదాహరణకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే రోడ్డు మీదకి వెళ్లకుండా ఈ వర్చువల్ రియాలిటీతో ఇంట్లో ఉండే వాస్తవ ప్రపంచంలో ఏ విధంగా నేర్చుకుంటారో అదే విధంగా నేర్చుకోవచ్చు. ఈ ట్రెయినింగ్ కేవలం కార్లకు మాత్రమే పరిమితం కాకుండా పైలట్‌కు కూడా ఉపయోగించవచ్చు. అలాగే క్రికెట్, ఫుట్‌బాల్ ఇలా ఏదైనా క్రీడలో ప్రారంభ దశ నుంచి ఒక ప్రొఫెషనల్‌గా అవడానికి కూడా ఇందులో ట్రెయినింగ్ ఉంటుంది. అంతేకాకుండా మిలిటరీలో, వైద్య రంగంలో, సాఫ్ట్ సిల్స్లో కూడా దీనిని ట్రెయినింగ్ ఇవ్వడానికి ఉపయోగిస్తారు.
వివిధ ఉద్యోగాలు
ఈ VR/AR టెక్నాలజీలో Game designer, Game developer, Concept artist (2D), 3D artist, 3D animator, Sound engineer లతో పాటు చాలా ఉద్యోగాలు ఉంటాయి.
నేర్చుకోవడం ఎలా?
లక్షల్లో వేతనాలు వచ్చే ఈ వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీలో విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా వారి నైపుణ్యాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఉడెమి, కోర్సెరా వంటి వాటిలో వీటిని నేర్చుకోవచ్చు. ఐబీ హబ్స్, నెక్ట్స్ వేవ్ ఆధ్వర్యంలో సీసీబీపీ ప్రోగ్రామ్స్ ద్వారా VR/AR వంటి మరెన్నో 4.0 టెక్నాలజీల్లో ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ ప్రోగ్రాం గురించి www.ccbp.in http://www.ccbp.in వెబ్సైట్లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 9390111765 నంబర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి లేదా support@nxtwave.techకి మెయిల్ పంపండి.
ఒకప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్, కంప్యూటర్ అనేది ఒక కల. కానీ ఇప్పుడు అవి కూడా మన జీవితంలో భాగమయ్యాయి. అలాగే వర్చువల్ రియాలిటీ (VR) కూడా ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్ లాగానే భవిష్యత్తులో మన జీవితంలో భాగం అవ్వనుంది.
-మార్ జుకెర్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ
ఇది చాలా గొప్పది, మీరు నిజంగా వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది.
భవిష్యత్తులో అన్ని దేశాలు ప్రతిరోజూ ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) అనుభవాలను కలిగి ఉంటాయి. రోజూ మనం భోజనం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఈ AR కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది.
వసంత సాయి ఫౌండర్, సీటీఓ ప్రొయుగ