జోగులాంబ గద్వాల : తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఏఆర్ కానిస్టేబుల్ ( AR constable) పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఒకరు వాటర్ ట్యాంక్ ( Water Tank ) పైకి ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం ( Jogulamba Gadwala ) లో ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్తో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
విషయం తెలుసుకున్న సీఐ శ్రీను ఘటనా స్థలానికి చేరుకుని సెల్ఫోన్లో బాధితుడితో మాట్లాడారు. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిర్యాదు చేయడంతో సీఐ అందుకు హామీ ఇచ్చాడు. దీంతో బాధితుడు ట్యాంక్ నుంచి దిగిరావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బాధితుడి నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి తదుపరి చర్యలకు సిద్దమైనట్లు సమాచారం.