Adulterated Ghee Seized | అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Adulterated Ghee Seized | ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. నెయ్యి తయారీ, పంపిణీ కేంద్రాలపై దాడులు చేశారు. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అధికారులు అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. ఢిల్లీ, హర్యానాలో నెయ్యి తయారీ, పంపిణీ కేంద్రాలపై దాడులు చేశారు. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. (Adulterated Ghee Seized) ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, నిర్దేశిత లేబులింగ్ సమాచారం లేకుండా ప్రీమియం ఆవు నెయ్యి అమ్మకాలకు సంబంధించిన డిజిటల్, ప్రింట్ ప్రకటనలను అధికారులు గమనించారు. పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి విక్రయాలు జరుగుతున్నట్లు అనుమానించారు. కస్టమర్ల మాదిరిగా ఆ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. వాటిని అక్రిడిటెడ్ ప్రయోగశాలకు పంపి పరీక్ష చేయించారు.
కాగా, ఆ నెయ్యి ఉత్పత్తులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. స్వచ్ఛమైన నెయ్యికి బదులుగా కూరగాయలు, ఇతర నూనెలు, పాలేతర పదార్థాల మిశ్రమం ఉన్నట్లు నిర్ధారించారు. ప్రయోగశాల నివేదిక ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. కల్తీ నెయ్యి తయారీ, నిల్వ, పంపిణీ నెట్‌వర్క్‌ను గుర్తించారు.
మరోవైపు జూన్ 17న కేంద్ర ఆహార భద్రతా అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు, పోలీసులు కలిసి పలు ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్ చేశారు. ఢిల్లీలోని ద్వారక సమీపంలోని ధుల్సిరాస్ గ్రామంలో ఉన్న రహస్య తయారీ కేంద్రంలో సోదాలు చేశారు. నకిలీ నెయ్యి తయారీకి ముడిసరుకుగా ఉపయోగిస్తున్న 1,020 లీటర్ల అనుమానిత నూనె, 1,500 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.
అలాగే హర్యానాలోని సోనిపట్ సెక్టార్ 53లోని బాలాజీ ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థపై అధికారులు రైడ్ చేశారు. మార్కెట్లో పంపిణీ కోసం ప్యాక్ చేసిన 4,000 లీటర్లకు పైగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీ, పంపిణీలో అంతర్రాష్ట్ర ముఠా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. కొందరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తెలిపారు. దీనిపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Adulterated Ghee
- Busted
- Delhi
- Fssai
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

