నల్లగొండ : కోటీశ్వరుల పిల్లల మాదిరిగానే పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను(Young India Integrated Residential School) కట్టిస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గంధంవారి గూడెం వద్ద రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ పాఠశాల పైలాన్ ఆవిష్కరించి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంగ్లీష్ , తెలుగు మీడియంలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ పిల్లలందరూ కులమతాలకు అతీతంగా చదువుకోవచ్చని తెలిపారు.
ఈ పాఠశాలల్లో చదువుతోపాటు ,అన్ని వసతులు ఉంటాయని, ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తున్నామని, క్రీడల వల్ల మానసికంగా విద్యార్థులు ఎదుగుతారని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపనతో తెలంగాణకు ఒక రోజు ముందుగానే దసరా పండుగ వచ్చిందని అన్నారు. 5000 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 28 నియోజకవర్గాలలో మొదటి విడతన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సిల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.