Yoga Teacher | వృత్తిరీత్యా యోగా ట్రైనర్ (Yoga Teacher) అయిన ప్రదీప్ ఉల్లాల్(54) కర్ణాటకలోని చిక్కమగళూర్‌లో ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నాడు. ఆన్లైన్లో కూడా యోగా క్లాసులు చెప్తాడు. తన దగ్గరికి వచ్చిన ఎన్ఆర్ఐ మహిళ(NRI Woman)కు మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు. కిందటి జన్మలో మనం లవర్స్ అంటూ అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళ ఈనెల 1న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. అదే రోజు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలి కుటుంబం పంజాబ్‌కు చెందింది. వారు 2000 నుంచి యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలో ఉంటున్నారని ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె 2021, 2022 మధ్య కాలంలో యోగా నేర్చుకోవడాని ఉల్లాల్‌ను సందర్శించింది. ఆ టైంలో ఆమెను మూడుసార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడని ఎన్ఆర్ఐ మహిళ ఆరోపించింది. ప్రదీప్ ఉల్లాల్(Pradeep Ullal)కి గత జన్మలో ఆమెతో సంబంధం ఉందని, వారిది దైవిక ప్రేమని ఆధ్యాత్మికత గురించి చెప్పాడట. బలవంతంగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, గర్భవతి అయ్యానని, అయితే చివరికి గర్భస్రావం అయిందని ఆ మహిళ చెప్పింది. నిందితుడిపై చిక్కమగళూరు రూరల్ (Chikkamagaluru Rural) పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఉల్లాల్ గతంలో దుబాయ్‌లో పనిచేసి బెంగళూరులో స్థిరపడ్డాడు. దుబాయ్‌లో కూడా అతను యోగా తరగతులు చెప్పాడు. తర్వాత 2010లో ఇండియాలకు వచ్చి చిక్కమగళూరు జిల్లాలో మూడు ఎకరాల భూమి కొన్నాడు. యోగా క్లాసులు నిర్వహిస్తు్న్నాడు’. అతను హిమాలయ యాత్రలకు, టూరిజం ట్రావెలింగ్ కూడా కొందర్ని తీసుకెళ్లేవాడని పోలీసులు చెబుతున్నారు.