యాదగిరిగుట్ట ‘ముక్కు వస్త్రాల’కు కొత్త టెండర్!
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించే మొక్కు వస్త్రాల సేకరణ హక్కుల కేటాయింపునకు కొత్తగా టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించాలని దేవస్థాన ఈవో జే భవానీశంకర్ ఉత్తర్వులు జారీచేశారు.
- పాత లైసెన్స్ పొడిగింపు ఉత్తర్వులు ఉపసంహరణ
- హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం
- బహిరంగ వేలానికి ఆదేశాలు
యాదగిరిగుట్ట, నవంబర్ 3: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించే మొక్కు వస్త్రాల సేకరణ హక్కుల కేటాయింపునకు కొత్తగా టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించాలని దేవస్థాన ఈవో జే భవానీశంకర్ ఉత్తర్వులు జారీచేశారు. పారదర్శకంగా, పోటీతో కూడిన విధానంలో టెండర్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రికార్డులు, వినతి పత్రాలు, హైకోర్టు ఆదేశాలు తదనంతర పరిణామాలను పరిశీలించిన అనంతరం దేవస్థానం ప్రయోజనాల దృష్ట్యా స్వామివారి మొక్కు వస్త్రాల సేకరణకు కొత్త టెండర్ నిర్వహిస్తున్నట్టు వివరించారు.
గత 2025 ఫిబ్రవరి 6న నిర్వహించిన టెండర్-కమ్-బహిరంగ వేలంతో స్థా నికుడైన నాగరాజుకు మొక్కు వస్త్రాల సేకరణ లైసెన్స్ హక్కులు కేటాయించారు. స్థానిక వ్యాపారి అన్నదాస్ వెంకటేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆదేశాలతో గత లైసెన్స్ పొడిగింపును రద్దు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

