ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నం కావడంతో ఎవరినైతే జైలుకి పంపాలని అనుకుంటున్నారో వారి టీ షర్ట్‌పై స్టాంప్ వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ ఆదేశించాడు. మొదటగా విశ్వ.. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో రవి.. బిగ్‌బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేయాలన్న ఐడియా నచ్చలేదంటూ అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు.
ప్రియాంక సింగ్, ప్రియ, షణ్ముఖ్, లోబో.. బిగ్‌బాస్ ప్రాపర్టీని ధ్వంసం చేసిన శ్వేతను వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నారు. సన్నీ, మానస్.. సిరిని; శ్రీరామ్, సిరి.. యానీ మాస్టర్‌ను వరస్ట్ పర్ఫామర్ అని చెప్పారు. అనీ..లోబోని; శ్వేత, జెస్సీ కూడా లోబోనే వరస్ట్ అని అభిప్రాయపడ్డారు. జెస్సీ ఈ వారం కనపడలేదంటూ మరోసారి అతడిని వరస్ట్ పర్ఫామర్‌గా ఎన్నుకున్నాడు రవి. ఎక్కువ ఓట్లు పడిన కారణంగా శ్వేతని జైలుకి పంపారు.
ఇక కాజల్..రవిని బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. రవిని క్షమించలేకపోతున్నానని మానస్‌తో చెప్పుకొచ్చింది . ఫేస్ చూసి మోసపోకని, సింపతీగా ఫేస్ పెడితే నమ్మేయకని నొక్కి చెప్పాడు మానస్. రవి ఐడియాకు తాను బలయ్యానని జైలులో ఏడ్చేసింది శ్వేత. తర్వాత షణ్ముఖ్ శ్వేతతో ఆమెకు ఈ పరిస్థితి రావడానికి గల కారణాన్ని చర్చించాడు. రవి మీతో చేయించాడు కానీ అతడు చేయలేదన్న విషయాన్ని స్పష్టం చేశాడు.