శరవేగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు

మహబూబ్ నగర్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పరిశీలించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా తుది డిజైన్లు పూర్తి చేసి కాలువ నిర్మాణ పనులు చేపడతామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని జలసౌధలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల పనులు పూర్తి అయిన వెంటనే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలోని భూములకు సాగునీరు అందించేందుకు కాలువలు సిద్ధం చేసి ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణ పేట, మక్తల్, కొడంగల్, షాద్ నగర్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో నీళ్లు పారేటట్లు కాలువలు తవ్వటానికి ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కూలంకషంగా చర్చించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులు సూచించిన కాలువల డిజైన్లు పై మంత్రి పరిశీలించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తగు సూచనలు, సలహాలు చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాలువల నిర్మాణ పనుల డిజైన్లపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
సీఎం కేసీఆర్ కాలువల డిజైన్లపై తుది నిర్ణయం తీసుకున్న వెంటనే నిర్మాణ పనులకు టెండర్లు పక్రియ మొదలు పెడ్తామన్నారు. కార్యక్రమంలో ఈఎన్సీ మురళీధర్ రావు, సీఈలు శ్రీనివాస్, రమేష్, ఎస్.ఈ కొంతం శ్రీనివాస్, ఎ.ఎస్.ఎన్.రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

