ధరలపై దండెత్తిన మహిళలు
నిత్యావసర ధరల పెరుగదలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
- ఎల్బీనగర్ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ, మౌన ప్రదర్శన
- ధరల పెంపుతో సామాన్యుడు విలవిల
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 3 : నిత్యావసర ధరల పెరుగదలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ధరల నియంత్రణ చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్‌తో ఎల్బీనగర్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్నగర్ కూరగాయల మార్కెట్ ముందు నుంచి ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ, మౌన ప్రదర్శన నిర్వహించారు. బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రంగేశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు నల్లటి దుస్తులు ధరించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. నిరసన ర్యాలీని ఎమ్మెల్యే
దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్లకార్డులతోనే ధరల తేడాలను చూపించారు.
కదం తొక్కిన మహిళలు
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఉన్న ధరల పట్టికతో పాటుగా
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఎంత శాతం ధరలు పెరిగాయనే వివరాలతో ప్లకార్డుల్లో పొందుపర్చి ప్రదర్శనలో
పాల్గొన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
25 కిలోల బియ్యం బస్తా క్వాలిటీకి అనుగుణంగా 1,150 నుంచి రూ. 1500 వరకు ఉండగా తాజాగా ఇదే 25 కిలోల బియ్యం బస్తాను రూ. 2250 నుండి రూ. 2400 వరకు విక్రయిస్తున్నారని, వంట నునె కిలో ధర రూ. 110 నుంచి ఏకంగా రూ. 189కు పెరిగాయని దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యులు నిత్యం కొనుగోలు చేసే కూరగాయలు మొదలుకుని కిరాణా సరుకుల వరకు జంకే పరిస్థితులు దాపురించాయన్నారు. సామాన్య ప్రజలను కాపాడేందుకు ధరల నియంత్రణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటుగా నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు తక్షణం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోకవర్గం బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు రంగేశ్వరి నాయుడు, మాజీ కార్పొరేటర్లు చెరుకు సంగీత, రమావత్ పద్మానాయక్, సీనియర్ మహిళా నేతలు మల్లీశ్వరిరెడ్డి, విజయలక్ష్మి, శిల్పారెడ్డి, రమాదేవి, నాగలక్ష్మి, అంజలి, ఆదిలక్ష్మి, జయశ్రీ, మమత, అనిత, ప్యారి, పార్వతి, దేవి, వసంత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

