ముంబై, జనవరి 27( నమస్తే తెలంగాణ): సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైఫ్‌పై దాడికి పాల్పడ్డ నిందితుడు షరీఫుల్ ఇస్లాం వాడుతున్న సిమ్ కార్డు పశ్చిమ బెంగాల్‌లోని చప్రాకు చెందిన ఖుకుమోని షేక్ అనే మహిళ పేరు మీద ఉందని పోలీసులు గుర్తించారు. ఆదివారం పోలీసులు ఆమెను ప్రశ్నించిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత సదరు మహిళ అతడికి సహకరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో లభించిన వేలి ముద్రలతో షరీఫుల్ ఇస్లాం వేలి ముద్రలు సరి పోలలేదని జరుగుతున్న ప్రచారాన్ని పోలీసులు కొట్టిపారేశారు. ప్రాథమిక పరిశీలనలో నమూనాలు సరిపోలాయని, తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అనధికార సమాచారంతో కేసుపై గందరగోళం సృష్టించవద్దని మీడియా, ప్రజల్ని ఆయన సోమవారం కోరారు.