కొత్త ఏడాదిలో అప్పుడే రెండో నెల పూర్తి కావస్తున్నది. ఈ ఏడాది చేసి తీరాలంటూ చాలానే విషయాలు అనుకుని ఉంటారు. మరి వాటిని సాధించేందుకు కృషి చేస్తున్నారా… లేదా అక్కడే ఆగిపోయారా?! లక్ష్యాలను చేరాలన్న ఆశ చాలామందిలో ఉన్నా అందుకు క్రమశిక్షణతో పనిచేయడంలోనే విఫలం అవుతుంటారు. అలా కాకుండా ఉండేందుకు తాము అనుకున్నదాన్ని రాయడం ఒక మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. రాయడం మనతో మనం చేసుకునే ఒప్పందంలా, ఓ బాండ్ పేపర్లా పనిచేస్తుందట.