ఫోలిక్ యాసిడ్ మనకు ఎందుకు అవసరమంటే..?
ఫోలిక్ యాసిడ్ | మన శరీరానికి అవసరం అయ్యే పోషకాల్లో విటమిన్ బి9 కూడా ఒకటి. దీన్నే ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అని కూడా పిలుస్తారు.

మన శరీరానికి అవసరం అయ్యే పోషకాల్లో విటమిన్ బి9 కూడా ఒకటి. దీన్నే ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ మన శరీరానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే ఎప్పుడూ నీరసంగా ఉంటారు. కొద్దిగా పనిచేసినా తీంవ్రమైన అలసట వస్తుంది. గుండె అసాధారణ రీతిలో వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తుంటాయి.
తలనొప్పి, ఏకాగ్రత లోపించడం వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. కనుక ఎవరైనా సరే.. ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో ఈ విటమిన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. ఫోలిక్ యాసిడ్ గర్భిణులకు ఎంతో అవసరం.
కడుపులో ఉన్న బిడ్డ సరిగ్గా ఎదగాలంటే ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను గర్భిణులు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఇతరులు కూడా ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను తమ రోజువారీ మెనూలో చేర్చుకోవాలి. ఫోలిక్ యాసిడ్ మన శరీరంలో నూతన కణాలను తయారు చేయడంలో, వాటికి పోషణ అందించడంలో ఉపయోగపడుతుంది.
అలాగే క్యాన్సర్ రాకుండా, డీఎన్ఏ మార్పులు జరగకుండా చూసేందుకు కూడా ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. పుట్టబోయే పిల్లల్లో మెదడు, వెన్నెముక సమస్యలు రాకుండా ఉండాలంటే గర్భిణులు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి.
అందుకే డాక్టర్లు కూడా గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ మందులను రాస్తుంటారు. ఇక ఇవే కాకుండా.. హైబీపీ రాకుండా ఉండేందుకు, రక్తహీనత సమస్య తగ్గేందుకు కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది. పాలకూర, బ్రొకోలి, బీన్స్, పచ్చి బఠానీలు, పప్పు దినుసులు, నిమ్మకాయలు, అరటి పండ్లు, పుచ్చకాయలు, తృణ ధాన్యాల్లో మనకు ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

