జెనీవా: కొత్త కరోనా వేయింట్ ‘Mu’ను సమీక్షిస్తున్నట్లు ప్రపచం ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియా దేశంలో ‘Mu’ వేరియంట్‌ను గుర్తించారు. Muను శాస్త్రీయంగా B.1.621గా పిలుస్తారు. ఈ వేరియంట్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. ఈ వారం రిలీజైన బులిటెన్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. ఈ వేరియంట్లో మ్యుటేషన్లు జరుగుతున్నాయని, అవి వ్యాక్సిన్లను తట్టుకునే రీతిలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. అయితే ఈ వేరియంట్ గురించి మరింత అధ్యయనం చేయాల్సి ఉందని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇమ్యూనిటీని తప్పించుకునే రీతిలో Mu వేరియంట్ డెవలప్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వైరస్‌లో జరుగుతున్న మ్యుటేషన్ల వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ ఎక్కువ శాతం విజృంభిస్తోంది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోవారిలో ఇది వ్యాపిస్తోంది. ఇంకా కరోనా ఆంక్షలు సరిగా పాటించని ప్రదేశాల్లోనూ ఆ వేరియంట్ వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నాలుగు వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. 193 దేశాల్లో ఆల్ఫా, 170 దేశాల్లో డెల్టా వేరియంట్ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో Mu వేరియంట్‌ను కూడా మానిటర్ చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.
తొలుత కొలంబియాలో కనిపించిన Mu వేరియంట్.. ఆ తర్వాత దక్షిణ అమెరికా దేశాలతో పాటు యూరోప్‌లో వ్యాప్తి చెందింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.1 శాతం మాత్రమే కేసులు ఉన్నాయి. కానీ కొలంబియాలో ఆ కేసుల శాతం 39గా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.