కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని పన్నులు, సుంకాల నుంచి లభించే రాబడిని పన్నుల రాబడి అంటారు. ప్రభుత్వానికి రాబడిని సమకూర్చే పన్నుల్లో ముఖ్యమైనవి 1) కార్పొరేషన్ పన్ను 2) ఆదాయపు పన్ను 3) ఎగుమతి, దిగుమతి పన్ను 4) ఎక్సైజ్ పన్ను 5) జీఎస్టీ కొత్త పన్నులు విధించడం, పన్ను రేట్లు మార్పులు, ప్రస్తుతం ఉన్న పన్నులను కొనసాగించడానికి ఫైనాన్స్ బిల్లు ప్రతిపాదన అవసరం. ఇది పార్లమెంట్ ఆమోదం పొందాలి.
కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు ఆస్తులను సృష్టించడానికి ఉపయోగపడితే దానిని మూలధన బడ్జెట్ అంటారు. ఉదా: దేశంలోని ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు.
ఏ) మూలధన రాబడులు
కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి సేకరించిన రుణాల మొత్తాన్ని మూలధన రాబడులు అంటారు. ఇవి రెండు రకాలు.
1) మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు
2) రుణేతర రాబడులు
బీ) మూలధన వ్యయం (Capital Expenditure)
సంతోష్ విషయ నిపుణులు కరీంనగర్