తన భర్త తన కళ్ల ముందే మరో మహిళకు కిస్ ఇస్తే ఈర్శ్యపడని ఆడవాళ్లు ప్రపంచంలో ఎవరూ ఉండరు. దీనికి సినిమా స్టార్లయినా అతీతం కాదు. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచిన జెనీలియా డిసౌజా కూడా అలాగా ఈర్శ్యపడింది. తన భర్త రితేస్ దేశ్‌ముఖ్ తన ముందే బాలీవుడ్ నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టాడు. ఇది చూసి ఆమె తెగ జెలస్‌గా ఫీలైంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన రితేష్‌ను జెనీలియా ఓ ఆటాడుకుంది. రితేష్.. ప్రీతికి కిస్ ఇవ్వడం వరకూ నిజమే కానీ.. జెనీలియా ఈర్శ్యపడటం, తర్వాత ఇంటికి వచ్చి రితేష్‌ను కొట్టడం మాత్రం ఉత్తదే. జెనీలియానే సరదాగా ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి ట్విటర్లో షేర్ చేసింది. నిజానికి ఎప్పుడో 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా ప్రీతికి రితేష్ కిస్ ఇచ్చిన వీడియోను జెనీలియా ఇప్పుడిలా ఫన్నీగా తయారు చేసింది.
For the love of the viral video.. 💚💚💚 & of course @Riteishd & the cutest ting ting @realpreityzinta pic.twitter.com/wCsPhDMPcq
— Genelia Deshmukh (@geneliad) March 19, 2021