ప్రైవసీ పాలసీని గడువు వాయిదా వేసుకున్న వాట్సాప్.. ఎందుకో తెలుసా..?
వాట్సాప్ సంస్థ తమ ప్రైవసీ పాలసీ గడువును వాయిదా వేసుకున్నది. తొలుత ఈనెల 15 లోగా ప్రైవసీ పాలసీకి అంగీకారం తెలుపనిపక్షంలో వినియోగదారుల ఖాతాలను నిలిపివేస్తామని ప్రకటించింది

న్యూయార్క్ : వాట్సాప్ సంస్థ తమ ప్రైవసీ పాలసీ గడువును వాయిదా వేసుకున్నది. ఈనెల 15 లోగా ప్రైవసీ పాలసీకి అంగీకారం తెలుపనిపక్షంలో వినియోగదారుల ఖాతాలను నిలిపివేస్తామని ప్రకటించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ గడువును వాయిదా వేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకున్నది. కాగా, ఈ కేసులో ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఇది మే 5 న విచారణకు రాగా.. వాట్సాప్, ఫేస్‌బుక్‌లతో పాటు కేంద్రం నుంచి ఈ నెల 13 లోగా స్పందన తెలియజేయాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
వాట్సాప్ వినియోగదారులు ఈ నెల 15లోగా ప్రైవసీ పాలసీకి అంగీకారం తెలుపాలని వాట్సాప్ సంస్థ ఈ ఏడాది జనవరి 20న ప్రకటించింది. దీని ప్రకారం, ప్రైవసీ పాలసీకి అంగీకారం తెలుపని వారి ఖాతాలను నిలుపుదల చేస్తామని పేర్కొన్నది. అయితే, కొన్ని కారణాల వల్ల ఇప్పుడా నిర్ణయాన్ని కంపెనీ వాయిదా వేసింది. తొలుత ఈ విధానాన్ని ఫిబ్రవరి 8 లోగా అంగీకరించాలని కూడా సూచించింది. వాట్సాప్ నిర్ణయంపై సోషల్ మీడియాతో పాటు చాలా చోట్ల తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. వాట్సాప్ నిర్ణయం తమ ప్రైవసీకి గొడ్డలిపెట్టు అని వినియోగదారులు వర్ణించారు. ఒక్కసారిగా వాట్సాప్ వినియోగదారులు తమ దారి మార్చుకుని సిగ్నల్, టెలిగ్రాం వంటి ఇతర మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించడం ప్రారంభించారు. వివాదం పెరిగి పోవడంతే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు నోటీసు జారీ చేసింది. దాంతో పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని సంస్థ తాము గతంలో విధించిన గడువును మరోసారి మే 15 వరకు పొడిగించింది.
ఇంతకీ ప్రైవసీ పాలసీలో ఏముంది?
ఫేస్బుక్, ఇతర సంస్థలతో యూజర్ సమాచారాన్ని పంచుకుంటామని కొత్త పాలసీలో వాట్సాప్ తెలిపింది. పాలసీని అంగీకరించిన తర్వాతనే వాట్సాప్‌లోని కంటెంట్‌ను అప్లోడ్ చేయడం, స్టోర్ చేయడం, పంపడం లేదా స్వీకరించడం వంటి వాటిని ఏ ప్లాట్ఫాంలలోనైనా.. ఏ దేశంలోనైనా ఉపయోగించుకోగలరని సంస్థ ప్రకటించింది. వినియోగదారుల భద్రత, సౌలభ్యాన్ని పెంచడానికే ఇలాంటి చర్యలు తీసుకున్నామని వాట్సాప్ కాకమ్మ కథలు చెప్పింది. వినియోగదారుల డాటాను కంపెనీ మరింత వాణిజ్యపరం చేస్తున్నాదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా చమురు పైప్‌లైన్‌పై సైబర్ దాడి.. ఎమర్జెన్సీ ప్రకటన
మాడ్రిడ్ ఓపెన్ : రెండోసారి టైటిల్ గెల్చుకున్న జ్వెరెవ్
దక్షిణాఫ్రికా దేశాధ్యక్ష పీఠంపై నెల్సన్ మండేలా.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల 1 నుంచి నిలిచిపోనున్న గూగుల్ ఉచిత సేవలు
అమెరికా ఆకాశంలో గుర్తుతెలియని వస్తువులు.. నిజానికి అవేంటంటే..!
రెమ్‌డెసివిర్ అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వైద్యుడు.. వీడియో వైరల్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

