Laptops | ప్రస్తుత కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారితో పాటు చుదువునే వారు కూడా ల్యాప్టాప్ లను ఉపయోగిస్తున్నారు. వీటిని వాడడం కొందరికి తప్పనిసరి అయిపోయిందని చెప్పవచ్చు. అన్ని రంగాల వారు ల్యాప్టాప్ లను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని దీర్ఘకాలం పాటు వాడాలి అనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ల్యాప్టాప్ వాడే వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చదువు నుండి ఆఫీస్ వరకు ల్యాప్టాప్ లు అనేక అవసరాలను తీరుస్తాయి. ఉద్యోగం, పని, వినోదం కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ చేసే వారికైతే ఫోన్ లాగా ల్యాప్టాప్ ఎప్పటికీ వారితోనే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ల్యాప్టాప్ చాలా సార్లు ఫిజికల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల ల్యాప్టాప్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే మరికొన్ని కారణాల వల్ల కూడా ల్యాప్టాప్ దెబ్బతినే అవకాశం ఉంది.
ల్యాప్టాప్ దీర్ఘకాలం పాటు పని చేయాలంటే ముఖ్యంగా ఫిజికల్ డ్యామేజ్ కాకుండా కాపాడాలి. ల్యాప్టాప్ లో చాలా సున్నితమైన భాగాలు ఉంటాయి. ల్యాప్టాప్ కింద పడడం వల్ల ఇవి దెబ్బతినే అవకాశం ఉంది. కనుక ల్యాప్టాప్ తో ప్రయాణించే వారు మంచి నాణ్యత కలిగిన బ్యాగును ఉపయోగించాలి. అలాగే చాలా జాగ్రత్తగా దీనితో ప్రయాణించాలి. అలాగే మనం పని చేసేటప్పుడు టీ, కాఫీ, నీరు వంటి ద్రవ పదార్థాలు ల్యాప్టాప్ పై పడిపోయే అవకాశం ఉంది. ఇవి లోపలి భాగాలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. కనుక ల్యాప్టాప్ దగ్గర్లో ఎటువంటి ద్రవపదార్థాలను ఉంచకూడదు.
ఓవర్ హీటింగ్ కారణంగా ల్యాప్టాప్ బ్యాటరీ దెబ్బతినే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన వాతావరణంలో నిరంతరం పనిచేయడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గుతుంది. కనుక బ్యాటరీ హీట్ అవ్వకుండా ఉండడానికి కూలింగ్ ప్యాడ్ లను ఉపయోగించాలి. పని చేసే చోట చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇక మాల్వేర్, వైరస్ లు డేటాను దొంగలించడంతో పాటు ల్యాప్టాప్ పనితీరును కూడా మందగించేలా చేస్తాయి. కొన్నిసార్లు వైరస్ ల కారణంగా ల్యాప్టాప్ ఆకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. కనుక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉపయోగించడం మంచిది. అలాగే అప్డేట్స్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ల్యాప్టాప్ ను అవ్డేట్ చేయడం మంచిది. ఇవి ల్యాప్టాప్ పనిచేయడానికి చాలా అవసరం. క్రమంతప్పకుండా వీటిని అప్డేట్ చేయడం వల్ల కొద్ద ఫీచర్లు లభిస్తాయి. బగ్స్ కారణంగా తలెత్తే సమస్యలు తగ్గుతాయి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం వల్ల ల్యాప్టాప్ ఎక్కువ కాలం సురక్షింతంగా, సమర్థవంతంగా పని చేస్తుంది.