చెన్నై: క్రికెట్ ప్రపంచకప్-2023లో భాగంగా భారత్ ఇవాళ ఆస్ట్రేలియాతో తన తొలి మ్యాచ్ ఆడుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ చరిత్రలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఎన్ని మ్యాచ్‌లలో తలపడ్డాయి..? ఎవరు ఎన్నేసి మ్యాచ్‌లు గెలిచారు..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1975 నుంచి 2019 వరకు జరిగిన ప్రపంచకప్‌లలో భారత్-ఆస్ట్రేలియా జట్లు మొత్తం 12 సార్లు తలపడ్డాయి. అందులో నాలుగు మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించగా, ఎనిమిది మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక ఆస్ట్రేలియా మీద భారత్ చేసిన అత్యధిక పరుగులు 352. 2019 వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్ 9న ఇంగ్లండ్‌లోని ఓవల్ జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 5 వికెట్లు నష్టపోయి 352 పరుగులు చేసింది.
అదేవిధంగా ప్రపంచకప్‌లలో ఇరు జట్లు నేరుగా తలపడిన గత మూడు మ్యాచ్‌లలో భారత్ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా మాత్రం కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచింది. అయితే, చెన్నైలో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు మూడు ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడి మూడింట విజయం సాధించింది. ఇప్పుడు నాలుగో మ్యాచ్ భారత్‌తో ఆడబోతోంది.