మీకు అంతరిక్ష అద్భుతాలపై ఆసక్తి ఉందా.. అయితే మీలాంటి వాళ్లకోసమే నాసా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. మనకు అందనంత దూరంలో ఉన్న కెరీనా నెబ్యులాను నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ తన కెమెరాలో బంధించింది.
ఈ కెరీనా నెబ్యలాలో కొంతమేర మాత్రమే హబుల్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసింది. ఇది మన గెలాక్సీలో అతిపెద్ద నక్షత్రాలను ఏర్పరుస్తున్న ప్రాంతాలలో ఒకటి. ఈ కెరీనా నెబ్యులా 7,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ఎక్కువగా హైడ్రోజన్ వాయువుతో ఏర్పడిందట. వీడియోలో నెబ్యులా మేఘాలు పర్వతంలా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి.
✨ Welcome to the Mystic Mountain ⛰️
— Hubble (@NASAHubble) June 8, 2021
This #HubbleClassic explores a small portion of the Carina Nebula, which is one of the largest star-forming regions in our galaxy.
The nebula is about 7,500 light-years away from us and mostly made up of hydrogen gas: https://t.co/ozNYev1d0k pic.twitter.com/n7XnXwgb7Q