వనపర్తి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి నిర్మించిన రైతన్న సినిమాను అన్ని వర్గాల వారు వీక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులతో మంగళవారం మంత్రి నిరంజన్‌రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్ నారాయణమూర్తి చక్కటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారని తెలిపారు. బుధవారం ఉదయం వనపర్తిలోని థియేటర్లో తాను ఈ సినిమాను వీక్షించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 గంటల వరకు అంతా థియేటర్‌కు చేరుకోవాలని సూచించారు. ఎవరి టికెట్ వారు కొనుగోలు చేసి సినిమా చూసి ఆదరించాలని కోరారు.