BJP MLA : బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రామ్ కదమ్ దాదాపు నాలుగేళ్ల తర్వాత హెయిర్ కట్ చేయించుకున్నాడు. మహారాష్ట్రలోని ఘట్కోపర్ నియోజకవర్గం నుంచి ఆయన అక్కడి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు కొండలు, గుట్టలు ఉండటంతో నీటి సరఫరా సమస్యగా మారింది. నీటి కొరతతో నియోజకవర్గ ప్రజలు పడుతున్న అవస్థలు ఆయనను కదిలించాయి.
ఈ క్రమంలో నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారమయ్యే వరకు తాను హెయిర్ కటింగ్ చేయించుకోబోనని నాలుగేళ్ల క్రితం ఆయన శపథం చేశారు. కొండ ప్రాంతాల్లో రెండు కోట్ల లీటర్ల నీటిని నిలువ చేసేలా వాటర్ ట్యాంకులు నిర్మించాలని వాటికి భందూప్ నుంచి వాటర్ లైన్లు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు మొదలయ్యాయి.
దాంతో గురువారం ఆయన నాలుగేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. ఈ సందర్భంగా రామ్ కదమ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఐదేళ్ల క్రితమే ‘కొండ ప్రాంతాల్లోని ప్రజలకు నీటిని సరఫరా చేయడం ఎలా’ అని ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పారు. ఇన్నాళ్లకు రెండు కోట్ల లీటర్ల నీటిని నిలువు ఉంచేలా వాటర్ ట్యాంకుల నిర్మాణం మొదలుకావడం తనకు సంతోషంగా ఉందన్నారు. భందూప్ నుంచి వాటర్ లైన్ నిర్మాణం కూడా జరుగుతోందని తెలిపారు.
*”जोपर्यंत आपल्या घाटकोपर विक्रोळीचा पाणीप्रश्न सुटत नाही, तोपर्यंत डोक्यावरील केस कापणार नाही”*
हा संकल्प घेऊन केलेला ४ वर्षांचा संयम, संघर्ष, सततचा पाठपुरावा आणि सातत्य… अखेर त्या प्रयत्नांना यश मिळालं आहे.
आज गुरुवार दिनांक 18 डिसेंबर रोजी सकाळी 11:00 वाजता, आनंदगड पाणी… pic.twitter.com/N9t4KR077k— Ram Kadam (@ramkadam) December 18, 2025