KCR Nagar | కేసీఆర్ నగర్లో విషాదం.. ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
ఒకే కంపెనీలో పనిచేసే సహోద్యోగుల మధ్య పరిచయం ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా కేసీఆర్ నగర్లో(KCR Nagar) చోటుచేసుకుంది.
సంగారెడ్డి : ఒకే కంపెనీలో పనిచేసే సహోద్యోగుల మధ్య పరిచయం ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా కేసీఆర్ నగర్లో(KCR Nagar) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మృతురాలు సకిన ఫాతిమా, హుస్సేన్ అలీ ఇద్దరూ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. ఫాతిమా కుటుంబానికి కేసీఆర్ నగర్‌లోని బ్లాక్ నంబర్ 40లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించారు. కాగా, నిన్న ఫాతిమా, హుస్సేన్ అలీ కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇంటికి చేరుకున్నారు.
అదే సమయంలో ఫాతిమా తండ్రి రావడంతో ఫాతిమా తండ్రికి దొరికిపోతామనే భయంతో ఆమె హుస్సేన్ అలీ సహకారంతో బాల్కనీ గుండా పక్క ఫ్లాట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టుతప్పి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి ఫాతిమా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

