న్యూఢిల్లీ: ఫరీదాబాద్‌లో 23 ఏళ్ల మహిళా షూటర్(Woman Shooter) తన హోటల్ రూంలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ షూటర్ స్నేహితురాలిని కూడా అరెస్టు చేశారు. బాధిత మహిళ నిందితులను హోటల్ రూమ్‌లో లాక్ చేసింది. డిసెంబర్ 17వ తేదీన ఈ ఘటన జరిగింది. పోలీసులను ఆమె అప్రమత్తం చేసింది.
బివానీకి చెందిన యువ షూటర్ ఫరీదాబాద్ హోటల్లో రేప్‌కు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బాధిత షూటర్‌కు చెందిన స్నేహితురాలైన మరో మహిళా షూటర్‌తో పాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. సూరజ్‌కుండ్‌లోని కర్ని స్టేడియంలో జరుగుతున్న షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బాధితురాలు ఫరీదాబాద్ వెళ్లింది. బాధిత మహిళా షూటర్‌తో ఆ టోర్నీలో పాల్గొనేందుకు రాజస్థాన్‌లోని జున్‌జున్‌కు చెందిన 26 ఏళ్ల మహిళా షూటర్ వచ్చింది. అయితే గురువారం షూటింగ్ పోటీలు ముగిసిన తర్వాత ఖ్వాజా సరాయిలోని హోటల్లో ఉండాలని బాధితురాలిని ఆమె స్నేహితురాలు అడిగింది.
బాధిత వ్యక్తికి చెందిన స్నేహితురాలి బాయ్‌ఫ్రెండ్ ఫరీదాబాద్ హోటల్లో రెండు రూమ్‌లు బుక్ చేశాడు. అయితే ఆ వ్యక్తి తనతో పాటు హోటల్‌కు మరో వ్యక్తిని తీసుకువచ్చాడు. ఆ ముగ్గురు కలిసి మద్యం సేవించేలా తనపై వత్తిడి తెచ్చినట్లు బాధితురాలు పేర్కొన్నది. ఆ తర్వాత ఓ వ్యక్తి ఉన్న రూమ్‌కు తనను పంపినట్లు బాధిత మహిళా షూటర్ ఆరోపించింది. ఆ సమయంలో అతను రేప్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. ముగ్గురు అనుమారితులను రూమ్‌లో బంధించిన బాధితురాలు ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హోటల్‌కు చేరుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది ఆ ముగ్గుర్నీ నిర్బంధించాకె. బాధితురాలి శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు.