మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. 52 ఏండ్ల వార్న్ ఆదివారం తన కుమారుడు జాక్సన్‌తో కలిసి మెల్బోర్న్లో స్పోర్ట్స్ బైక్‌పై రైడ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. 15 మీటర్ల దూరం రోడ్డుపై రాసుకుంటూ వెళ్లినట్లు స్థానిక మీడియా సంస్థ పేర్కొంది. అయితే పెద్ద ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు.