USA | అమెరికాలో జార్జియా రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెలుగు వ్యక్తి చాడ సుహృత్ రెడ్డి కూడా ఉండటం గమనార్హం. అట్లాంటా శివారు ప్రాంతాలైన శాండీ స్ప్రింగ్స్, డన్వుడీ పోలీసులు సంయుక్తంగా అండర్ కవర్ ఆపరేషన్ ఆపరేషన్ నిర్వహించిన వీరిని పట్టుకున్నారు.
మానవ అక్రమ రవాణా, వ్యభిచార ముఠాలపై మానవ అక్రమ రవాణా లక్ష్యంగా జనవరి 29, 30వ తేదీల్లో ఆపరేషన్ శాండీ స్ప్రింగ్స్ గార్డియన్ పేరుతో అమెరికాలో పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అట్లాంటాలోని పవర్స్ ఫెర్రీ రోడ్డు సమీపంలోని హోటళ్లలో ఈ సోదాలు నిర్వహించారు. అక్రమంగా లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం, వ్యభిచారం కోసం సంప్రదించడం వంటి నేరాలు కింద 8 మందిని పట్టుకున్నారు. వీరిపై సొలిసిటేషన్ ఫర్ ఇల్లిసెట్ సెక్సువల్ యాక్ట్ కింద వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. కాగా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగువారు ఇలాంటి నేరాల్లో పట్టుబడటం ఇప్పుడు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అరెస్టయిన చాడ సుహృత్ రెడ్డిది తెలంగాణలోని వరంగల్‌గా తెలుస్తోంది. 2020లో కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతను ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. 2022లో అమెరికాలోని అరిజోనా స్టేట్ ఆఫ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఎంఎస్ పూర్తి చేసినట్లు సమాచారం. వ్యభిచారం కింద అతనిపై కేసు నమోదైంది. ఈ కేసు రుజువైతే ఏడాది పాటు జైలుశిక్షతో పాటు రూ.90 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.