హనుమకొండ, నవంబర్ 26:మరింకెందుకు ఆలస్యం..? మన హనుమకొండలో నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే ప్రాపర్టీ షోకు రండి.. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్’ సంయుక్తంగా ఆది, సోమవారాల్లో నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోండి.. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ నగరాల నుంచి ప్రముఖ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సంస్థలు, బ్యాంకులు ఒకే వేదికపైకి వచ్చే ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. ఉచితంగానే ప్రాపర్టీ షోకు తరలివచ్చి లక్కీ డ్రా ద్వారా బహుమతులు కూడా అందుకోండి..ప్రాపర్టీ షో నేడు ఉదయం 10గంటలకు ప్రారంభం కానుండగా ఆది, సోమవారాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో పాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్నారు.
చారిత్రక ఓరుగల్లు నగరంలో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కానుంది. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే’, ‘టీ న్యూస్’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఆదివారం ఉదయం 10గంటలకు ప్రాపర్టీ షో ప్రారంభం కానుంది. ఆది, సోమవారాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు ప్రాపర్టీ షో కొనసాగుతుంది. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ నగరాల నుంచి పలు ప్రముఖ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ సంస్థలు, బ్యాంకులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి. వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్‌లు, ఇతర కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి అయ్యే ఖర్చు, బ్యాంకు రుణాలకు సంబంధించి పూర్తి సమాచారం అందిస్తాయి. ప్రాపర్టీ షోకు వచ్చే సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడంతో పాటు లక్కీ డ్రా ద్వారా బహుమతులు కూడా అందజేయనున్నారు. రెండు రోజుల పాటు సందర్శనకు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వ్యాపారులు, ఉద్యోగులు తరలిరానున్నారు.
ఒకే వేదిక.. పూర్తి సమాచారం
రోజురోజుకూ విస్తరిస్తున్న ఓరుగల్లు నగరంలో విల్లాలు, అపార్ట్మెంట్లు, రెడీమేడ్ ఇండ్లు, వెంచర్లతో పాటు బ్యాంకులు అందించే రుణ సదుపాయం తదితర అంశాలపై సమాచారం తెలుసుకోవచ్చు. నగరం, శివారు, హైదరాబాద్ నగరం, శివారులో ఎక్కడెక్కడ ఏయే వెంచర్లు ఏర్పాటవుతున్నాయి?, ఏవి అందుబాటులో ఉన్నాయి?, ధరలు, సదుపాయాలు ఎలా ఉన్నాయి? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? తదితర పూర్తి సమాచారం పొందవచ్చు.
వేగంగా నగరాభివృద్ధి
తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పక్కా ప్రణాళికలతో నగరాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు. నగరం చుట్టూ ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లతో పాటు అందమైన కూడళ్లు, అద్దాల్లాంటి రోడ్లు, పార్కులు అందుబాటులోకి వచ్చాయి. చారిత్రక విశిష్టత కలిగిన ఓరుగల్లు, విద్య, వైద్యం, టెంపుల్, టూరిజం హబ్‌గా అవతరించింది. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లావాసులంతా హనుమకొండ, వరంగల్ నగరాలు, శివారులో సొంత ఇండ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ఔత్సాహికుల కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్’ ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాయి. సందర్శకులందరికీ భూముల కొనుగోలు, ఇండ్ల నిర్మాణాలు, బ్యాంకు రుణాలపై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశాయి.
ప్రాపర్టీ షో స్పాన్సర్లు వీరే
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రాపర్టీ షోకు ‘టీ న్యూస్’ మీడియా పార్ట్నర్గా వ్యవహరించనుంది. మెయిన్ స్పాన్సర్‌గా ఏవీ ఇన్ఫ్రాకాన్, అసోసియేట్ స్పాన్సర్‌గా బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్, గిప్ట్ స్పాన్సర్‌గా నీలోఫర్, అసోసియేషన్ విత్గా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డబ్ల్యూడీసీసీబీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు, కనకదుర్గా హోమ్స్, మైత్రీ ఇన్ఫ్రా ప్రాజెక్టు, జీఎంఆర్ గోకులం, మేఘా, అవని, జేఎస్ఆర్ సన్‌సిటీ, శాశ్విత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఇందులో భాగస్వాములు అవుతున్నాయి.