Aaryan Trailer| ప్రముఖ తమిళ నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆదివారం నటుడు దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలయ్యే డార్క్ ఇంటెన్స్ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. విష్ణు విశాల్ ఇందులో శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన గతంలో నటించిన సంచలన థ్రిల్లర్ ‘రాట్ససన్’ తర్వాత మరోసారి పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. విష్ణు విశాల్‌తో పాటు సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.