Virat Kohli Super Catch | సింగిల్ హ్యాండ్‌తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కింగ్ కోహ్లీ.. వీడియో
Virat Kohli | టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత జట్టు తొలి వన్డేలో(ODI Series) తడాఖా చూపించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 3, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 114 పరుగులకే కుప్పకూలగా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో (WI vs Ind) టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో కరీబియన్లను చిత్తుచేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ (Virat Catch) అందుకున్నాడు.
Virat Kohli | టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత జట్టు తొలి వన్డేలో(ODI Series) తడాఖా చూపించింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 3, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 114 పరుగులకే కుప్పకూలగా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో (WI vs Ind) టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో కరీబియన్లను చిత్తుచేసింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.
ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేయడానికి జడేజా బౌలింగ్ కు వచ్చాడు. అయితే ఆ ఓవర్ మూడో బంతిని విండీస్ ఆల్‌రౌండర్ రొమేరియో షెఫర్డ్ భారీ షాట్ ఆడేందుకు షెఫర్డ్ ప్రయత్నించగా.. ఆ బంతి ఎడ్జ్ తీసుకుని కుడి వైపు స్లిప్‌లో ఉన్న కోహ్లీ వైపు దూసుకెళ్లింది. దీంతో అమాంతం గాల్లోకి జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో విండీస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ షెఫర్డ్ (0) పెవిలియన్ చేరాడు. ఇక ప్రస్తుతం కోహ్లీ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో కరీబియన్లను చిత్తుచేసింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ ప్లేయర్లు గల్లీ క్రికెటర్ల తరహాలో పెవిలియన్‌కు క్యూ కట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు.. 23 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (43) టాప్ స్కోరు కాగా.. మయేర్స్ (2), హెట్‌మైర్ (11), పావెల్ (4), కింగ్ (17) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 4, జడేజా 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో మెరిశాడు. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది.
King Grab 🦀@imVkohli pulls off a stunner 😱#INDvWIonFanCode #WIvIND pic.twitter.com/ozvuxgFTlm
— FanCode (@FanCode) July 27, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

