Virat Kohli | రన్ మెషీన్ విరాట్ కోహ్లీ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీ లిఖించుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఆయన సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఏ జట్టు అయిన, ఏ బౌలర్ అయిన సరే విరాట్ బ్యాట్ నుండి పరుగులు రావల్సిందే. ప్రస్తుతం ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉంది. ఈ సారి అయిన ఆర్సీబీకి టైటిల్ అందించాలనే కసితో ఉన్నాడు విరాట్. ఇక ఇంటర్నేషనల్ టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేలు, టెస్ట్‌లు మాత్రమే ఆడుతున్నాడు.
అయితే విరాట్ జీవితం చాలా మందికి ఇన్సిపిరేషన్‌గా ఉంటుంది. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన బయోపిక్ తీయాలని చాలా మంది దర్శకులు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విరాట్ కోహ్లీ బయోపిక్ రూపొందనుందని, అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తాడని కూడా ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ నటుడు శింబు విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటిస్తాడనే టాక్ మొవలైంది. అందుకు కారణం విరాట్ ఓ చాట్ షోలో తనకు ఇష్టమైన పాట గురించి అడగగా, తమిళ సినిమా ‘పట్టు తల’ లోని ‘నీ సింగం ధన్..’ పాటను రిపీట్ మోడ్‌లో వింటానని చెప్పాడు. ‘నీ సింగం ధన్’ అంటే ‘నువ్వు నిజంగా సింహంవి’ అని అర్ధం.
ఈ పాట శింబు సినిమాలోని పాట కాగా, ఈ పాట గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతున్న వీడియోను శింబు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “విరాట్ కోహ్లీ నువ్వు నిజంగా సింహం” అని దానికి క్యాప్షన్ ఇచ్చాడు. వీడియోలో కోహ్లీ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, విమానాశ్రయంలో వేచి చూస్తున్నప్పుడు పాటని వింటున్నట్టుగా కనిపించింది. శింబు పాటని విరాట్ అంత మెచ్చాడు కాబట్టి కోహ్లీ బయోపిక్‌లో శింబు నటించడం ఖాయం అని కొందరు జోస్యాలు చెబుతున్నారు. కాగా, ఈ మధ్య శింబు లుక్ కాస్త విరాట్ లుక్ మాదిరిగానే ఉంది. కాగా, ఇప్పుడు శింబు నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది.
View this post on Instagram
A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru)