వైరల్ వీడియో.. కూలిన భారీ వృక్షం.. తృటిలో తప్పించుకున్న మహిళ
కూలిన భారీ వృక్షం.. తృటిలో తప్పించుకున్న మహిళ | అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను పలు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది.

ముంబై : అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను పలు రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది. గుజరాత్, ముంబైలో పెనుగాలులతో కురిసిన వర్షానికి భవనాలు దెబ్బతినగా.. భారీగా చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపడగా తీరని నష్టం కలిగింది. పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ముంబై నగరంలో వర్షానికి భారీ వృక్షం నేల కూలుతుండగా.. ఓ మహిళ రెప్పపాటులో ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన సోమవారం జరగ్గా.. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఎనిమిది సెకన్ల పాటు ఉన్న వీడియోలో ఓ మహిళ గొడుగు పట్టుకొని నడుస్తుండగా.. చెట్టు కూలిపోయి కొమ్మలు ఆమెపై పడబోయాయి. ఇది గమనించి మహిళ వెంటనే అప్రమత్తమై తప్పించుకుంది. ఈ సీసీటీవి ఫుటేజీని ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. సోమవారం తౌటే తుఫాను మహారాష్ట్రలో పెను విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, గంటకు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వీచిన గాలులకు చెట్లు కూలిపోగా.. 2,500 ఇండ్లకు నష్టం కలిగింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 11 గంటల పాటు మూసివేయగా.. తుఫాను కారణంగా 230 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. మే నెలలో 24 గంటల్లో ఇంత వర్షాపాతం నమోదవడం చరిత్రలో ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
#WATCH | Mumbai: A woman had a narrow escape when she managed to move away from the spot just in time as a tree uprooted and fell there. (17.05.2021)
— ANI (@ANI) May 18, 2021
Mumbai received heavy rain and wind yesterday in wake of #CycloneTauktae
(Source: CCTV footage) pic.twitter.com/hsYidntG7F
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు రెండు రోజులూ వర్ష సూచన
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్
ఘోరం.. మధ్యదరా సముద్రంలో పడవ మునిగి 57 మంది మృతి
హైదరాబాద్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఉత్పత్తి!
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు.. ఒకే రోజు 4,529 మంది బలి
షాకింగ్.. కొవిడ్ చికిత్స నుంచి రెమ్‌డెసివిర్ అవుట్!
వ్యాక్సిన్ తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతివ్వాలి : నితిన్ గడ్కరీ
కరోనాతో ఎమ్మెల్యే కన్నుమూత
రోజుకు 25లక్షల కొవిడ్ టెస్టులు లక్ష్యం : హర్షవర్ధన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

