Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral news | సాధారణంగా పాములు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి. కానీ ఆ ఇంట్లోకి మాత్రం రోజూ పాములు వస్తున్నాయి. కేవలం గడిచిన వారం రోజుల వ్యవధిలోనే 30 పాములు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లా కహార్కా గ్రామంలోని ఇంట్లో ఈ విచిత్రం జరుగుతోంది. ఆ ఇంట్లోకి పదేపదే పాములు వస్తున్నాయి.
Viral news : సాధారణంగా పాములు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి. కానీ ఆ ఇంట్లోకి మాత్రం రోజూ పాములు వస్తున్నాయి. కేవలం గడిచిన వారం రోజుల వ్యవధిలోనే 30 పాములు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్ (Uttarpradesh) లోని బాగ్పత్ జిల్లా (Bagpath district) కహార్కా గ్రామంలోని ఇంట్లో ఈ విచిత్రం జరుగుతోంది. ఆ ఇంట్లోకి పదేపదే పాములు వస్తున్నాయి. ఆ ఇంటి ఆవరణలోనే ఎడాపెడా గుడ్లు పెడుతున్నాయి. దాంతో ఆ ఇంటివాళ్లతోపాటు ఇరుగుపొరుగున ఉన్నావాళ్లు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కపిల్ త్యాగి అనే ఆ వ్యక్తి ఇంట్లోకి గడిచిన ఎనిమిదేండ్ల నుంచి తరచూగా పాములు వస్తున్నాయి. గత వారం రోజులుగా వాటి సంఖ్య బాగా పెరిగింది. ఏడు రోజుల్లోనే సుమారు 30 పాములు వచ్చాయి. అటవీ సిబ్బంది వాటిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. ఇవన్నీ నాగుపాములు కావడంతో కపిల్ తన నివాసాన్ని తవ్వించాలనే నిర్ణయానికి వచ్చారు. అలా తవ్వుతుండగా ఇంటి పరిసరాల్లో దాదాపు 100 పాముగుడ్లు బయటపడ్డాయి. ఈ క్రమంలో కపిల్ కుటుంబం భయంతో రాత్రిళ్లు నిద్రకూడా సరిగా పోకుండా బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.
ఈ ఇంటిని జిల్లా అటవీ అధికారి వినోద్ కుమార్ పరిశీలించారు. తాము అండగా ఉంటామని హామీ ఇస్తూనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

